ప్రజాశక్తి - చెరుకుపల్లి
విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులకు బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం కనగాల గ్రామంలో దాడి చేశారు. ఆంజనేయ స్వామి గుడి వద్ద నున్న గోడౌన్ నుండి రేషన్ బియ్యంను లారి No.GJ12 BT 5525 ద్వారా గుజరాత్ రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్నారని అందిన విశ్వసనీయ సమాచారంతో పట్టుకున్నారు. ఎపి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ ఆదేశాల మేరకు గుంటూరు రీజనల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ ఎస్పీ కె ఈశ్వరరావు పర్యవేక్షణలోఅధికారులు సోమవారం మద్యాహ్నము కనగాల గ్రామంలోని ఆంజనేయ స్వామి గుడి వద్ద నిఘా వేశారు. అక్కడే ఉన్న గోడౌన్ నుండి లారిలోకి బస్తాలు లోడు చేసిన తరువాత దాడి చేసి పట్టుకున్నారు. లారిలో 400ప్లాస్టిక్ తెల్ల బస్తాలలో పిడిఎస్ బియ్యం లోడు చేసినట్లు కనుగోన్నారు. కారుమూరు గ్రామానికి చెందిన జొన్న సత్యనారాయణ, కనగాల గ్రామంలో గోడౌన్ అద్దెకు తీసుకొని చుట్టు ప్రక్కల గ్రామాల నుండి రేషన్ బియ్యం కొనుగోలు చేశాడు. సదరు గోడౌన్లో నిల్వ చేసి ఇతర రాష్ట్రాలకు తరలించి అమ్ము తున్నట్లు గుర్తించారు. 400 బస్తాలలోని 200క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం లారీతో సహా స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయి జొన్న సత్యనారాయణ, లారి డ్రైవర్, యజమానిపై 6ఎ, క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. తనిఖీలలో తహసిల్దార్ కె నాగమల్లేశ్వరరావు, ఎస్ఐ శ్రీరామచంద్రయ్య, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.










