కేసు వివరాలు వెల్లడిస్తున్న ఎస్‌ఐ రామకృష్ణ
ప్రజాశక్తి -సీలేరు
సారాను అక్రమంగా తరలిస్తున్న యువకుడిని పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... పోలీసు బలగాలు చింతపల్లి క్యాంపు సమీపంలో గురువారం ఉదయం తనిఖీలు నిర్వహిస్తుండగా జీకే వీధి మండలం సీలేరు మేజర్ పంచాయతీ పరిధి చింతపల్లి క్యాంపునకు చెందిన వంతల గణేష్ సారా అక్రమంగా తరలిస్తూ పోలీసులు పట్టుబడ్డాడు. దీంతో గణేష్ వద్ద నుంచి సారాను స్వాధీనం చేసుకుని, ఆయన్ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గణేష్‌ని విచారించిన అనంతరం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ రామకృష్ణ మాట్లాడుతూ సారా తయారీ, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గిరిజన యువత చెడు మార్గాలను వీడాలన్నారు.










