Mar 20,2023 00:27
స్వాధీనం చేసుకున్న మద్యంతో పోలీసులు

ప్రజాశక్తి-బాపట్ల రూరల్‌: అక్రమంగా మద్యం కలిగి ఉన్న వ్యక్తులను బాపట్ల సెబ్‌ పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. బాపట్ల సెబ్‌ సీఐ సుంకర శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపట్ల నియోజకవర్గంలోని పివి పాలెం మండలం మంతెనవారిపాలెం గ్రామంలో నాన్‌-డ్యూటీ పైడ్‌ లిక్కర్‌ కలిగి ఉన్న ఒక నిందితుడిని అరెస్ట్‌ చేయగా మరో వ్యక్తిని అరెస్టు చేయాల్సి ఉందని తెలిపారు. ఆదివారం బాపట్ల సెబ్‌ కార్యాలయం ఆవరణలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పివిపాలెం గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు, రాంభొట్లవారి పాలెం గ్రామానికి చెందిన జూపూడి బేబీశ్వరరావు నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో 60 750 ఎమ్‌ఎల్‌ మెన్షన్‌ హౌస్‌ ఫ్రెంచ్‌ బ్రాందీ, ఒక లీటర్‌ పరిమాణం గల 10 మొత్తం 71 బాటిళ్ల నాన్‌ డ్యూటీ మద్యం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అలాగే మారుతి సుజుకి కారు, ఒక సెల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి పరారీలో ఉన్న వ్యక్తిని పట్టుకుంటా మని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.