ప్రజాశక్తి - పార్వతీపురంరూరల్ : ప్రభుత్వంలోని లోపాలని, పాలకుల అసమర్ధతను, నిరంకుశత్వాన్ని ప్రశ్నించిన ప్రతిపక్షాలను, ప్రజాసంఘాల నాయకులపై అక్రమ కేసులుపెట్టి అరెస్టులు చేయించడం ముఖ్యమంత్రి అలవాటుగా మార్చుకున్నారని టిడిపి పార్వతీపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి బోనెల విజయచంద్ర అన్నారు. చంద్రబాబు అరెస్టుపై నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా బుధవారం వెంకంపేట ఘోరీల కూడలిలో మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులుతో కలిసి రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు గొట్టాపు వెంకటనాయుడు, ఎఎంసి మాజీ చైర్మన్ రెడ్డి శ్రీనివాసరావు, కౌన్సిలర్లు కోరాడ నారాయణరావు, బడే గౌరినాయుడు, టి.వెంకటరావు, కోలా సరిత మధుసూదనరావు, నాయకులు బార్నాల సీతారామారావు, బోను చంద్రమౌళి, గురజాన చంద్రమౌళి, జాగాన రవికుమార్, బేతలక్ష్మణరావు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కురుపాం : మాజీముఖ్యమంత్రి చంద్రబాబును కుట్రపూరితంగా అరెస్టు చేయించి సంబరాలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి కచ్చితంగా ప్రజలు బుద్ధి చెబుతారని టిడిపి నియోజకవర్గ ఇంఛార్జి తోయక జగదీశ్వరి అన్నారు. బుధవారం స్థానిక టిడిపి కార్యాలయం వద్ద తెలుగు రైతు విభాగం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అనంతరం పోస్టుకార్డుల ప్రదర్శన చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అరుకు పార్లమెంట్ తెలుగు రైతు విభాగం అధ్యక్షులు దేవకోటి వెంకటనాయుడు, ఎఎంసి మాజీ చైర్మన్ కోలా రంజిత కుమార్, తవిటినాయుడు, కృష్ణబాబు, బొంగు సురేష్, ఐదు మండలాల కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సీతంపేట : పాలకొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో చంద్రబాబుకు తోడుగా మేము సైతం కార్యక్రమంలో భాగంగా రిలే నిరాహార దీక్షలు పార్టీ కార్యాలయం సమీపంలో నిర్వహించారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ సీతంపేటలో ''బాబుకు తోడుగా ఒక నియంతపై పోరాటం కోసం మేము సైతం''అంటూ చేపడుతున్న రిలే నిరాహారదీక్షలో ఆయన పాల్గొన్నారు. ఆయనతో పాటు రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి బిడ్డిక చంద్రరావు, సర్పంచ్ బిడ్డిక నీలయ్య, బిసి సెల్ అధ్యక్షులు ఆర్.రంగనాధం, ఐటిడిఎ కో-ఆర్డినేటర్ హిమరక పవన్, మహాశక్తి ప్రచారకర్త తోయిక సంధ్యారాణి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










