Aug 04,2023 00:27

వినుకొండ: 'ప్రభుత్వ భూములు ఆక్రమించిన భూ కబ్జా రాయుడు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు' అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం సభలో చేసిన ఆరోపణలపై విను కొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు స్పందించారు. గురువారం స్థానిక వైసిపి కార్యాలయంలో జరి గిన విలేకరుల సమావేశంలో ఆయన మాటా ్లడుతూ సెంటు ప్రభుత్వ భూమిని తాను ఆక్ర మించినట్లు నిరూపిస్తే కనుక తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్‌ విసిరారు. లోకేష్‌ తన తండ్రిని అడ్డం పెట్టుకొని మంగళ గిరిలో స్థలాలు ఆక్రమించలేదా అని ఆరోపిం చారు. రాజకీయంగా ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణమైన చంద్ర బాబు ఇప్పుడు ఎన్టీఆర్‌ ఫోటో పెట్టుకోవడానికి సిగ్గులేదా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరావతిని తీసుకొచ్చామని చెప్పిన వారిని అక్కడ ప్రజలు ఓడించారని ఎద్దేవా చేశారు. తన రాజకీయ స్వార్థం కోసం యువతను రెచ్చగొట్టి కేసులు ఉన్నవారికి పదవులు ఇస్తామని ప్రకటిం చడం సిగ్గుచేటని అన్నారు. వైసిసి అధికారంలోకి వచ్చిన తర్వాత తాను చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేసేందుకు ఫ్లెక్సీలు వేసామని అన్నారు. ౖౖ'టిడిపి హయాంలో వినుకొండ నియోజకవర్గానికి రూ.2,400 కోట్లతో అభివృద్ధి చేశామని చెప్పు కొంటున్న మీరు.. ఆ విషయాన్ని ఫ్లెక్సీ ద్వారా ప్రజలకు చెప్పొచ్చుగా అని అన్నారు.