అక్రమాలపై నిష్పక్షపాతంగా విచారించాలి- ఏపీ రైతు సంఘం కడప జిల్లా కార్యదర్శి దస్తగిరి రెడ్డి
కడప అర్బన్: మైదుకూరు పసుపు కొనుగోలులో జరిగిన అక్రమాలు, అవినీతిపై నిష్పక్షపాతంగా విచారించాలని విచారణ కమిటీ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వరరావుకు ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.దస్తగిరి రెడ్డి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీసీఎంఎస్ , మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ల అండదండలతోనే పసుపు కొనుగోలులో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని తెలి పారు. నాసిరకం పసుపు కొనుగోలు చేశారని వాటిని గోడౌన్స్ పంపిన తర్వాత తిరస్కరణకు గురైందని, ఆ పసుపును 1500 బస్తాలను డిసి ఎంఎస్ అధికారులు, రైతులకు చేర్చాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. వాటిని తిరిగి ఇవ్వ కుండా, రైతులకు తెలియకుండా అమ్ముకోవడం చాలా అన్యాయమని పేర్కొన్నారు. పసుపు అవినీతి కొనుగోలు, అక్రమాలు, అవినీతి పై కలెక్టర్ విచారణ కమిటీ వేయడాన్ని స్వాగతి స్తున్నామని చెప్పారు. నిష్పక్షపాతంగా రాజకీ యాలకతీతంగా విచారణ కమిటీ విచారించి రైతు లను మోసం చేసిన వారిపై కఠినంగా శిక్షించాలని కోరారు. విచారణ కమిటీకి ఏపీ రైతు సంఘం జిల్లా కమిటీ పూర్తి ఆధారాలు, వీడియోలు, ఆడియోలతో నివేదికను అందించామని పేర్కొన్నారు.










