ప్రజాశక్తి -ఆనందపురం : మండలంలోని కొండ గ్రావెల్‌ను అక్రమంగా తవ్వితే కఠిన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ లోకవరపు రామారావు హెచ్చరించారు. ఆనందపురం సర్వే నెంబరు 276 ఎంపిడిఒ కార్యాలయం సమీపంలోని జగనన్న కాలనీలో రాత్రివేళ అక్రమంగా గ్రావెల్ తవ్వి భూ కబ్జాకు పాల్పడానికి శనివారం సాయంత్రం చదునుచేశారు. దీనిపై స్థానికులు ఫిర్యాదు మేరకు తహశీల్దార్ రామారావు స్పందించి గ్రామ విఆర్‌ఒకు సమాచారం అందించారు. రెవెన్యూ అధికారులు పరిశీలన జరిపి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ, అర్ధరాత్రి సమయం ఆదివారం సెలవు దినాలలో కొంతమంది పలు అక్రమాలకు పాల్పడుతున్నారని, వీరిపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విఆర్‌ఒ అప్పలరెడ్డి ఆధ్వర్యాన విఆర్‌ఎ అప్పలరాజు, స్వర్ణాంజలి ఆక్రమణ స్థలంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.










