Aug 03,2023 21:16

రామ్మోహన్‌ను వినతి పత్రం అందజేస్తున్న నాయకులు

 కడప అర్బన్‌ : ముఖ్యమంత్రి బామర్ది ఇసి సురేంద్రనాథ్‌రెడ్డిని యోగి వేమన విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా యుజిసి నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి నోటిఫికేషన్‌ లేకుండా విసి చింతా సుధాకర్‌, పాలకమండలి సభ్యులు కలిసి నియమించడం తగదని విద్యార్థి, యువజన సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈవిషయంపై అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు స్పందించాలని కోరుతూ టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డికి, సిపిఐ జిల్లా కార్యదర్శి జి. చంద్రకు, సిపిఎం నగర కార్యదర్శి రామమోహన్‌రెడ్డికి, బిఎస్‌పి జిల్లా ఇన్‌ఛార్జి గుర్రప్ప, కాంగ్రెస్‌ నగర అధ్యక్షులు వై. విష్ణుప్రీతంరెడ్డి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమ నియామకానికి రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పిడిఎస్‌యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.అంకన్న, తెలుగు యువత రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ఎస్‌.జియావుద్దీన్‌, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ కడప పార్లమెంటరీ ఉపాధ్యక్షులు పి.భరత్‌ కుమార్‌, ఎన్‌ఎస్‌యుఐ జిల్లా అధ్యక్షులు మామిళ్ళ బాబు, డివైఎఫ్‌ఐ నగర అధ్యక్షుడు ఎస్‌.షాకీర్‌ హుస్సేన్‌, ఎస్‌ఎఫ్‌ఐ నగర అధ్యక్షుడు బి.సురేష్‌ నాయక్‌,పిఎస్‌యు జిల్లా కన్వీనర్‌ సి.పి.నాగేంద్ర, నిరుద్యోగ, విద్యార్థి, యువజన సంఘం నాయకులు శ్రీనాథ్‌, గణేష్‌, గౌస్‌ పాల్గొన్నారు.