Nov 01,2023 21:51

భూమిలో దాచిపెట్టిన మద్యం సీసాలు తీయిస్తున్న ఎసిపి, సిఐలు

ప్రజాశక్తి - నందిగామ : నందిగామ పట్టణ శివారు అనాసాగరం గ్రామంలో తెలంగాణ మద్యం డంప్‌ను నందిగామ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే నందిగామ శివారు అనాసాగరం గ్రామ సమీపంలో బెరేతుల నాగమణి అనే మహిళ నిర్మానుష్య ప్రాంతంలో భూమిలో సొరంగంల గుంత తీసి ఆ గుంతలో తెలంగాణా మద్యం దాచి పెట్టారు. ఎసిపి జనార్ధన్‌ నాయుడు సిఐ హనీష్‌ తనిఖీలు జరపగా గ్రామ సమీపంలో పోలీసులకు దొరకకుండా ఉండేందుకు గుంత తవ్వి పెట్టినట్లు గుర్తించారు. తెలంగాణ మద్యం ఆంధ్రాలో అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని ఎసిపి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎసిపి జనార్దన్‌ నాయుడు మాట్లాడుతూ తెలంగాణ మద్యం తీసుకొచ్చి ఆంధ్రాలో అధిక ధరలకు అమ్ముతున్న వారిపై ఇప్పటికే 65 చోట్ల రైడ్స్‌ చేశామని తెలిపారు.