May 07,2023 22:19

అనుడా వైస్‌ ఛైర్మన్‌ వై.ఓబులేసునందన్‌

 కడపప్రతినిధి : జిల్లాలోని అక్రమ భవన నిర్మాణాలపై కొరడా ఝులిపిస్తాం. కలెక్టర్‌ సహకారంతో జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన లేఅవుట్లలో అక్రమ లేఅవుట్లను గుర్తించాం. ఈమేరకు రూ.35 లక్షల జరిమా నాల్ని వసూలు చేశాం. ఉమ్మడి కడప జిల్లాలోని నాలుగు వేల పైచి లుకు పం చాయతీలు, మున్సి పాలిటీలకు సంబంధించిన ప్రణాళికా సంబంధిత అంశాలు, భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్లకు అనుమతులు, మాస్టర్‌ప్లాన్స్‌, భూవినియోగ మార్పు, జోనల్‌ డెవలప్‌ మెంట్‌ ప్లానింగ్‌ పరిధిలోని నిర్మాణ పనులను ప్రణాళి కాబద్దంగా అభి వృద్ధి చేయడంపై దృష్టి సారిం చామని పేర్కొంటున్న అన్నమయ్య అర్బన్‌ అథారిటీ కార్పొరేషన్‌ వైస్‌ఛైర్మన్‌ కె.ఓబులేసు నందన్‌తో ప్రజా శక్తి ముఖాముఖి...
'అనుడా' పరిధిని వివరించండి?
ఉమ్మడి కడప జిల్లాలోని 13,062 స్వేర్‌ కిలోమీటర్ల మేర విస్తరించింది. జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో కడప మిన హా మిగిలిన తొమ్మిది అసెంబ్లీ నియోజ కవర్గాల పరిధిలోని నాలుగు వేలకుపైగా పంచాయతీలు, తొమ్మిది మున్సిపాలిటీల పరిధిలోని భ వన నిర్మాణాల లేఅవుట్లు, ఇతర అభివృద్ధి పనులను అనుడా పరిధి లోకి తేవడం తెలిసిందే.
అనుడా ప్రాధాన్యతను గురించి తెలపండి?
రాష్ట్రంలోని మూడు అథారిటీల్లో అన్నమయ్య అర్బన్‌ డెవల ప్‌మెంట్‌ అథారిటీ ఒకటి. ఇందులో ప్రధానంగా గుంటూరు జిల్లా లోని ఎపిసిఆర్‌డిఎ, వైజాగ్‌లోని విఎం ఆర్‌డి తర్వాత అనుడా మూడోస్థానంలో నిలిచింది. అనుడా జిల్లా భవిష్యత్‌ ప్రణాళికలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్పవచ్చు.
అక్రమ లేఅవుట్ల నివారణ చర్యలను గురించి తెలపండి?
ఉమ్మడి జిల్లాలో సుమారు 500పైగా భవన నిర్మాణ లేఅవు ట్లు ఉన్నాయి. ఇందులో 100 అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు గుర్తించడ మైంది. ఈమేరకు అక్రమ లేఅవుట్ల నిర్వాహకుల నుంచి 30 రోజుల వ్యవధిలో రూ.35 లక్షల మేరకు జరిమా నాలు విధించడ మైంది. అక్రమ లేఅవుట్ల నిరోదంలో జరిమానాలను విధించడంతో పాటు పరిస్థితిని బట్టి కోర్టుల్లోనూ పిల్‌ వేసే అవకాశాలు కూడా ఉంటాయ నే విషయాన్ని అక్రమార్కులు గుర్తుంచుకోవాలి.
అక్రమ లేఅవుట్లపై విమర్శలకు కారణాలేమిటి?
జిల్లాలో ఇష్టారాజ్యంగా లేవుట్లను ఏర్పాటు చేయడమే. ఉమ్మడి జిల్లాలోని పంచాయతీల పరిధిలో ఆన్‌లైన్‌ మాద్యమం ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకుని అన్ని అనుమతులు వచ్చిన తర్వాత లేఅవుట్లను ఏర్పాటు చేయాలి. అటువంటి ప్రక్రియ పద్ధతి ప్రకారం చేయకపోవ డమే విమర్శలకు కారణం.
అక్రమ లేఅవుట్ల ప్రాంతాల గురించి తెలపండి?
ఉమ్మడి కడప జిల్లాలోని పులివెందుల డివిజన్‌లో పులివెం దుల, వేంపల్లి, కడప డివిజన్‌లో చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి, జమ్మల మడుగు డివిజన్‌లో ప్రొద్దుటూరు, మైలవరం, జమ్మలమడు గు, దువ్వూరు, చాపాడు, బద్వేల్‌ డివిజన్‌లో పోరుమామిళ్ల, రాజం పేట డివిజన్‌లో రైల్వేకోడూరు, నందలూరు, రాయచోటి డివిజన్‌లో రాయచోటి, సంబేపల్లి ప్రాంతాల్లో చింతకొమ్మదిన్నె ప్రాంతాల్లో అధిక సంఖ్యలో అక్రమ లేఅవుట్లను గుర్తించడమైంది.
జగనన్న స్మార్ట్‌టౌన్‌షిప్‌ గురించి వివరించండి?
ఉమ్మడి జిల్లాలోని మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచు కుని అందుబాటు ధరల్లో జగనన్న టౌన్‌షిప్‌ను ఏర్పాటు చేయడ మైంది. ఈమేరకు జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జగన న్న టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో భాగ ంగా జిల్లాలోని రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, బద్వేల్‌ ని యోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన జగనన్నటౌన్‌షిప్‌ లేఅవు ట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఊపందుకుంది. రాబోయే రోజుల్లో కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల నియోజకవర్గ కేంద్రాల్లో జగనన్న టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్లాట్ల రిజి స్ట్రేషన్‌ వివరాల కోసం 7382665060 నెంబర్‌ను సంప్రదిం చాల్సి ందిగా కోరుతున్నాం.