Nov 06,2023 18:15

అక్రమ లే అవుట్‌ వేసిన దృశ్యం

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :మండలంలో ఇటీవల అక్రమ లే అవుట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి.. వెంచర్లు వేసే క్రమంలో పంట కాలువలు సైతం కనుమరుగవుతున్నాయి. మండలంలోని నరుకూరు నుంచి కోడూరు వెళ్లే ఆర్‌ అండ్‌ బి రోడ్డు (స్టేట్‌ బ్యాంక్‌ పక్కన) సర్వే నంబర్‌ 7/1, 7/2, 8, 9/ఏ, 9/బి, 10ఎలలోని సుమారు 8.50 ఎకరాల్లో కౌస్తుభం ఎస్టేట్స్‌ డివైన్‌ సిటీ పేరుతో వెంచర్‌ వెలిసింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు నిర్మించిన ఈవెంచర్‌లో ఇరిగేషన్‌ శాఖకు సంబంధించిన నీటి పారుదల కాలువ వెళ్తోంది. కాలువగా సుమారు 60 ఎకరాలకు సాగు నీరు అందేద ని రైతులు చెబుతున్నారు. అయితే ఎటువంటి అనుమతులు తీసుకోకుండా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఈ పారుదల కాలువను పూడ్చి వే సినట్లు స్థానికులు చెబుతున్నారు. వైసిపి నేతల అండతోనే రియల్టర్లు దర్జాగా ఇరిగేషన్‌ కాలువను కబ్జా చేశారన్న ప్రచారం జరుగుతోంది. సంబంధిత శాఖ ఉన్నతధికారులు జోక్యం చేసుకొని అక్రమణ చెర నుంచి పారుదల కాలు వను విడిపిం చాలని రైతులు డిమాండ్‌ చేస్తు న్నారు.
విచారణ చేపడతాం : ఎఇ
నరుకూరులో న్యూ బాలాజీ పారుదల కాలువ ఆక్రమణకు గురైన విషయం తన దష్టికి రాలేదని ఇరిగేషన్‌ ఏఇ విజయ భాస్కర్‌ రెడ్డి తెలిపారు. కాలువ అక్ర మణకు గురైనట్లు నిర్ధారణ అయితే చర్యలు తీసుకొంటామ ఆయన తెలిపారు.