రాయచోటి టౌన్ : ఒక ప్రాంతం అభివద్ధి జరుగుతోంది అంటే అక్కడి ప్రజలందరికీ సౌకర్యాలు మెరుగ్గా ఉంటాయని, అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలో రాయచోటి నుండి రాజంపేట రోడ్డు నిర్మాణం, మురుగు నీటి కాలు వలు నిర్మాణ పనులు ఆ ప్రాంత వాసులను రోడ్డుపాలు చేసేందుకే జరుగుతు న్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు విమర్శించారు. శనివారం రాజంపేట రోడ్డు నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని, అక్రమ కూల్చివేత ఆపాలని కోరుతూ ముద్రించిన ప్రచార కరపత్రాలు పంపిణీ చేశారు. రాయచోటి పట్టణంలో ఠాణా సెంటర్ నుండి పాత మున్సిపల్ కార్యాలయం వరకు ఇంటిం టికి తిరిగి కరపత్రాలు పంచుతూ విస్తతంగా ప్రచారం చేశారు. ఈ సందఠంగా ఆయన మాట్లాడుతూ రాయచోటి పట్టణంలో రోడ్లు, కాలువలు నిర్మిస్తున్నారని సిపిఎం ఈ పనులను స్వాగతించిందని, రాయచోటి ప్రజలు సంబర పడ్డారని వివరించారు. నిర్మాణం జరుగుతున్న తీరు చూస్తుంటే అభివద్ధి పెద్దలకు మాత్రమే సామాన్యులకు కాదని తేటతెల్లం అవుతోందని, ''కాకులను కొట్టి గద్దలకు వేసే చందంగా'' కాంట్రాక్టర్ల లాభాలకోసం సామాన్య ప్రజలను రోడ్డున పడవేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణ పనులు చేపట్టిన ద్వారకా కన్ స్ట్రక్షన్ కంపెనీకి లాభాలు కోసం ఠాణా సెంటర్ నుండి సుండుపల్లి రోడ్డు లో ఉన్న ఇండ్లను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, నష్టపరిహారం చెల్లించకుండా, పునరావాసం చూపకుండా అధికారులు, అధికార పార్టీ నాయకులు దౌర్జన్యంగా ప్రజల ఇండ్లను కూలగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 2013 భూసే కరణ చట్టం ప్రకారం నష్టపరిహారం అందచేసి, పునరావాసం కల్పించిన తర్వాత ఇండ్లు పడగొట్టాల్సిన అవసరం ఉన్నదని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, నష్టపరిహారం ఊసే లేకుండా ఎవరి ఇండ్లను వాళ్లే పడగొట్టుకునే విధంగా భయ బ్రాంతులకు గురిచేసి అధికార పార్టీ నేతలు శునకానందం పొందుతున్నారని ఎద్దేవా చేశారు. రోడ్డు వెడల్పుతో పాటు ఇరువైపులా నిర్మిస్తున్న మురుగునీటి కాలువల నిర్మాణం అలీమాబాద్ ప్రాంతం నుండి వచ్చే డ్రైనేజీ నీరు మండిల వద్ద గల కాలువకు, రవి హాల్ వద్ద నుండి వచ్చే మురుగు నీటిని కూడా మండీల వద్ద ఉన్న తూములకు కలుపుతూ జరుగుతుందని దీనివల్ల పట్టణంలోని మొత్తం డ్రైనేజీ నీరు మరియు వర్షపు నీరు ఒకే కాలువకు చేరి, లోతట్టు ప్రాంతమైన కొత్తపల్లి ప్రాంతంలోని ఇండ్లల్లోకి నీరు మునిగి పోతుందని వివరించారు. అయితే రవి హాల్ నుండి వచ్చే డ్రైనేజ్ కాలువను ఠాణా వద్ద గల డ్రైనేజ్ కాలువకు కలపడం ద్వారా కొత్తపల్లి ప్రాంత ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయవచ్చని, అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని విమర్శిం చారు. జిల్లాలో రాచరిక పద్ధతులు అవలంభిస్తున్న అధికార పార్టీ నేతలు కల్లు తాగిన కోతిలాగా వ్యవహరిస్తూ, సామాన్య ప్రజలపై దాడులకు తెగబ డుతున్నారని, దౌర్జన్యంగా ఇండ్లు కూలగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలఓట్లతో గద్దెనెక్కిన వైసీపి పార్టీ ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్య హక్కులను ఖూనీ చేస్తూ, అధికార మద బలంతో సామాన్య ప్రజలపై దౌర్జన్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. నిర్వాసితులకు అండగా సిపిఎం ఇప్పటికే అనేక ఉద్యమాలు పోరాటాలు చేస్తున్నది. అదేవిధంగా రాజంపేట రాయచోటి రోడ్డు విస్తరణలో నిర్వాసితులవుతున్న ప్రజలకు సిపిఎం అండగా నిలుస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని, స్థానిక శాసనసభ్యుల తీరును ఎండగడుతూ ప్రజల్లోకి వస్తోందని వివరించారు. రాజంపేట రోడ్డులో నిర్వాసితులవుతున్న ప్రజలకు 2013 భూసేకరణ చట్ట ప్రకారం నష్ట పరిహారం ఇవ్వాలని, చట్ట ఉల్లంఘనకు పాల్పడి దౌర్జన్యంగా ఇల్లు కూలగొడుతున్న ద్వారకా కన్స్ స్ట్రక్షన్ కంపెనీ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పునరావాసం కల్పించి, నష్టపరిహారం చెల్లించాలని లేని పక్షంలో బాధితులను కూడగట్టి, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు సహకారంతో పోరాటం ఉధ తం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు డిసి.వెంకటయ్య పాల్గొన్నారు.










