అక్రమ కట్టడాన్ని పరిశీలిస్తున్న సిబ్బంది
ప్రజాశక్తి అనంతగిరి:మండల కేంద్రంలోని వైఎస్‌ఆర్ విగ్రహం సమీపం పెద్దురు గ్రామానికి వెళ్లే రోడ్డుకు ఆనుకొని ప్రభుత్వ భూమిలో బినామి పేరుతో గిరిజనేతురుడు నిర్మిస్తున్న అక్రమ కట్టడం పనులను స్థానిక రెవిన్యూ అధికారులు గురువారం నిలిపివేశారు. అక్రమ కట్టడాల పనులను గుర్తించిన వీఆర్వో రాజేశ్వరి సిబ్బందితో వెళ్లి గిరిజనుడైన బాకా. వెంకటరావు కు చెప్పారు. వెంకటరావు వద్ద నుండి గిరిజన నేతరుడు క్రయ విక్రయాలు జరిపినట్లు ఫిర్యాదులు అందాయని అందుకే పనులను పరిశీలించామన్నారు. తక్షణమే పనులు నిలుపుదల చేయకుంఏట చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వీఆర్‌ఏ లింగమూర్తి పాల్గొన్నారు.










