Aug 14,2023 20:27

జెసిబితో అక్రమ కట్టడాలను కూల్చివేయిస్తున్న తహశీల్దార్‌ బాగ్యలత

కలికిరి : స్థానిక మండల కేంద్రంలోని సిఎల్‌ఆర్‌సి భవనం వెనుక ఉన్న ప్రభుత్వ భూములలో అక్రమంగా కట్టిన భవనాలను కూల్చి వేస్తున్నట్లు తహ శీల్దార్‌ భాగ్యలత పేర్కొన్నారు. కలెక్టర్‌ గిరీష జగనన్న కాలనీ సందర్శనలో భాగంగా లేఔట్‌ను పరిశీలించి 566 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలని కూల్చి వేయాలని ఆదేశించినట్లు చెప్పారని అన్నారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు సోమవారం జెసిపి సహాయంతో పోలీ సుల ఆధ్వర్యంలో అక్రమ కట్టడాలను కూల్చివేసినట్లు తెలిపారు. మండ లంలోని అన్ని గ్రామాలలో కూడా ప్రభుత్వ భూమిని ఎవరైనా ఆక్రమిస్తే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ భూమిని ఎవరైనా ఆక్రమించినటు సమాచారమివ్వాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో సర్వేయర్‌ దేవి, ఎస్‌ఐ రహీముల్లా, విఆర్‌ఒలు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.