ప్రజాశక్తి - ఆదోని
పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో అక్రమ కట్టడాల తొలగింపును మున్సిపల్ అధికారులు ముమ్మరం చేశారు. రోడ్డుకిరువైపులా ఏర్పాటు చేసుకున్న బంకులను, దుకాణాలను బుధవారం జెసిబి ద్వారా తొలగించారు. కాలువపై ఏర్పాటు చేయరాదని పలుమార్లు హెచ్చరించినా బేఖాతరు చేయడం వల్ల తొలగించామని అధికారులు తెలిపారు. వేలాది రూపాయలు వెచ్చించి చిన్నగా వ్యాపారం చేసుకునే వారిపై మున్సిపల్ అధికారులు ప్రతాపం చూపడం వల్ల జీవనోపాధి కోల్పోయామని బాధితులు వాపోయారు. కనికరం చూపకుండా మున్సిపల్ అధికారులు వ్యవహరించడం తగదని పలువురు విమర్శించారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకున్నా తొలగింపునకు పూనుకోవడం ఏమిటని పలువురు నిందించారు. అసిస్టెంట్ కమిషనర్ అనుపమ, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ శ్రీనివాసులు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నాగభూషణం రెడ్డి, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ హరినాథ్, అసిస్టెంట్ ఇంజినీర్ మదన్ ఉన్నారు.
బంకులను తొలగిస్తున్న అధికారులు










