May 22,2023 23:57

స్వాధీనం చేసుకున్న కలప

ప్రజాశక్తి-గొలుగొండ: అక్రమంగా తరలించేందుకు రహస్య ప్రదేశంలో దాచి ఉంచిన టేకు దుంగలను సోమవారం గొలుగొండ అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ కు చెందిన ఓ వ్యక్తికి గొలుగొండ మండలం దారమటం సమీపంలోని పాత మల్లంపేట రెవిన్యూ పరిధిలో సుమారు 60 ఎకరాలలో టేకు తోటలు ఉన్నాయి. ఈ టేకు తోటలలో నాలుగు రోజుల క్రితం కొంతమంది వ్యక్తులు టేకు చెట్లను నరికించి తరలించడానికి దాచారు. సమయం చూసుకొని వీటిని పట్టణ ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా రహస్య ప్రదేశానికి తరలించారు. ఈ విషయమై బాధితులు అటవీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అటవీశాఖ అధికారులు సోమవారం ఉదయం అక్రమంగా దాచి ఉంచిన టేకు దొంగలను స్వాధీనం చేసుకుని గొలుగొండకు తరలించారు పట్టుకున్న కలప విలువను అంచనా చేస్తున్నామని అటవీసెక్షన్‌ అధికారి లక్ష్మణ్‌ తెలిపారు.