అక్రమ కేసులు ఎత్తివేయాలి - టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి
రాయచోటి : తంబళ్లపల్లె, అంగళ్లు, పుంగనూరులో పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్.శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఎస్‌పి గంగాధర్‌రావును కలిశారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు తిరగకూడదని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు 50 మందిపైన కేసు నమోదు చేశారన్నారు. తాను అంగళ్లు పర్యటనలో లేకపోయినప్పటికీ తనపైన 307 సెక్షన్ కింద కేసు నమోదు చేయడం బాధాకరమన్నారు. తను ఆ సమ యంలో ఈ జిల్లాలో రాష్ట్రంలో లేనని తెలిపారు. తనతో పాటు అనేకమంది టిడిపి నాయకులు కార్యకర్తలు పైన అక్రమ కేసులు పెట్టారన్నారు. రాష్ట్రంలో తిరిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందన్నారు. తమ నాయకుడికి ప్రజల బ్రాహ్మ రథం పడుతున్నారని దీనిని జీర్ణించుకోలేక వైసిపి నాయకులు పోలీ సులపై ఒత్తిడి తెచ్చి ఇలాంటి అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. దీనిపైన ఎస్పీ గంగాధరరావుకు వినతి పత్రం ఇచ్చామన్నారు. త్వరలో చిత్తూరు జిల్లా ఎస్పీని కూడా కలుస్తానని తెలిపారు. వైసిపి నాయకులు అరాచకాలను ప్రజల ను గమనిస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసిపికి తగిన బుద్ధి ప్రజలు చెబు తారని తెలిపారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి గాజులు ఖాదర్‌బాష, మాజీ మండల ఉపాధ్యక్షులు అనుంపల్లి రాంప్రసాద్‌రెడ్డి, టిడిపి పట్టణ అధ్యక్షు లు ఎస్.ఖాదరవల్లి, టిడిపి నాయకులు కొట్టే చలపతి, శివారెడ్డి పాల్గొన్నారు.










