మాట్లాడుతున్న చాకలకొండ శారద
అక్రమ కేసులు ఎత్తేయాలి
ప్రజాశక్తి-కావలి:అక్రమ కేసులను ఎత్తేయాలని సామాజిక కార్యకర్త, విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు చాకలకొండ శారద ఒకప్రకటనలో డిమాండ్ చేశారు. వివరాలమేరకు.. మణిపూర్ మారణకాండపై నిజనిర్ధారణ జరిపేందుకు ' ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ' ఒక కమిటీగా ఏర్పడింది. మణిపూర్ సందర్శించి, అన్ని కోణాల్లో అక్కడ మే3 వతేదీ నుంచి తాజాగా జరుగుతున్న దుర్ఘటనలపై విచారణ జరిపి నివేదికను సమర్పించారని, వారిపై డబుల్ ఇంజిన్ సర్కార్ పెట్టిన అక్రమ కేసులను తక్షణం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.'నిజంచెప్పడమే నేరంగా ' భారతీయ నియంత పాలనలో పరిగణించి,ఆ పత్రికా ప్రముఖులపై కేసు నమోదు చేసింది మణిపూర్ డబులింజన్ ప్రభుత్వం ! ఇది ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేఛ్చను కాలరాయడమే నన్నారు. మే మూడు పూర్వమే మణిపూర్ కుకీ అల్ప సంఖ్యాక గిరిజన తెగ పై అక్కడి బిజెపి ప్రభుత్వ అండదండలతో మెజారిటీ వర్గమైన మైతీలు గహదహనాలు , ఆస్తులు తగులబెట్టి ,మహిళలను నగంగా ఊరేగించి, గ్యాంగ్ రేప్ చేసి చంపి, అడ్డుకున్న తండ్రి తమ్ముళ్లను ఘోరంగా చంపేసినా ' ఆ ప్రభుత్వానికి నేరంకాలేదు' , అక్కడి ప్రజల సమాచార హక్కుకు భంగం కల్గిస్తూ, ఇంటర్నెట్ ను నెలల తరబడి నిలిపివేసినా పట్టలేదన్నారు. జరిగిన దుశ్శాసన పర్వపు వీడియో వైరల్ అయి, దేశవ్యాప్త నిరసనలు జరిగినా లెక్కలేదన్నారు అక్రమ కేసులను తక్షణమే మణిపూర్ సర్కార్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేయాలన్నారు.










