ప్రజాశక్తి-బాపట్ల: బాపట్ల నియోజకవర్గంలో వైసీపీ నాయకులు చేస్తున్న ఇసుక దందా, అక్రమ తవ్వకాలపై తగు చర్యలు తీసుకొని ప్రకృతిని పరిరక్షించాలని కోరుతూ బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్ వేగేశన నరేంద్రవర్మ సూచనల మేరకు బాపట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు మంగళవారం బాపట్ల మండల తహశీల్దారు కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దారుకు, రూరల్ పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ టిడిపి అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు మాట్లాడుతూ వైసీపీ నాయకులు బరితెగించి ఇసుక అక్రమ దందా చేస్తూ కోట్లు గడిస్తున్నారని అన్నారు. బాపట్ల ప్రజలు ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే కోన రఘుపతి అవినీతి మత్తులో సంపాదనే ధ్యేయంగా ఇసుక అక్రమ తవ్వకాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ముక్కామల సాంబశివరావు, కావూరి శ్రీనివాసరెడ్డి, ఇనగంటి గాంధీ, గుడిపల్లి సాంబశివరావు, ఫరిద్ మస్తాన్, మీరావలి కొల్లూరి వెంకట్రావు, మరీదు వెంకటేశ్వరరావు, అంద్రెయ్య, పరిశా రమేష్, చెన్నుపాటి కిషోర్, జెట్టి దినేష్, హనుమాంజీ, యలమంద, ఆడే వంశీ, షాలేం రాజు, ఉమ్మారెడ్డి వెంకటేష్, దుర్గాప్రసాద్, సోములు, సలగల రాజా, చార్లెస్, పసుపులేటి శివ, పల్నాటి శ్రీను, తాహేర్, బొడ్డు గోవింద్, యోబు, అమరేశ్, తాత చినబాబు, రసూల్ పాల్గొన్నారు.










