Nov 12,2023 00:27
గ్రావెల్‌ తవ్వకాల ప్రాంతాలను పరిశీలిస్తున్న నాయకులు


ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్‌:జగనన్న ఇళ్ల స్థలాల లేఅవుట్లలో అక్రమ గ్రావెల్‌ తవ్వకాలను అరికట్టాలని సిపిఎం నాయకులు డిమాండ్‌ చేశారు. శనివారం సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అడిగర్ల రాజు, సభ్యులు కె.ఈశ్వరరావులు నర్సీపట్నం మున్సిపాలిటీ బలిఘట్టం రెవిన్యూ పరిధిలోని శివాలయం వెనుక మూడో కొండకు అనుకొని పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అడిగర్ల రాజు మాట్లాడుతూ, ప్రభుత్వం పేదలకు ఇచ్చేందుకు సెంటు చొప్పున లేఅవుట్లు వేసి రోడ్లు, కరెంట్‌ స్తంబాలు వేసిందన్నారు. లేఅవుట్లలో ఉన్న సరిహద్దు రాళ్లను తొలగించి పెద్ద ఎత్తున గ్రావెల్‌ రవాణాతో గోతులు కనబడ్డాయన్నారు. కరెంట్‌ స్తంబాలు తవ్వి గ్రావెల్‌ను తరలించడం జరిగిందన్నారు. సుమారు ఎకరా పరిదిలో వందల ట్రాక్టర్లు తవ్వకాలు జరిగితే సదురు విఆర్‌ఓ పర్యవేక్షణ లేదా అని ప్రశ్నించారు. ఈ అక్రమ తవ్వకాలపై ఉన్నత స్థాయి అధికార్లతో విచారణ జరిపి అక్రమంగా గ్రావెల్‌ తవ్విన వారి నుండి ఎంత మేరకు తవ్వకం జరిగిందో అంతా వసూలు చేయాలన్నారు. తవ్వకందారులతోనే ఇళ్ల స్థలాలు గోతులు పూడ్పించి పేదలకు స్థలాలు అప్పగించాలని డిమాండ్‌ చేశారు.