Jul 12,2023 21:11

సమావేశంలో మాట్లాడుతున్న లక్ష్మిరాజ

కడప అర్బన్‌ : ఇటీవల జరిగిన ప్రభుత్వ అక్రమ బదిలీలు రద్దు చేయాలని కోరుతూ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట జరిగే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజ పేర్కొన్నారు. బుధవారం యుటిఎఫ్‌ భవన్‌లో జిల్లా ఆఫీస్‌ బేరర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ఇటీవల జరిగిన బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ఒక పెద్ద ప్రహసనంగా జరిపారని పేర్కొన్నారు. బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు క్యాడర్‌ స్ట్రెంత్‌ సమస్య కారణంతో నేటికీ జీతాలు చేయకపోవడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నట్లు తెలి పారు. ఆన్‌లైన్‌ బదిలీలలో జరిగిన పొరపాట్లను సవరించలేదని చెప్పారు. జిల్లాలో 15 మందికి ప్రభుత్వ అక్రమ బదిలీలు నిర్వహించారని, పిజిటి లుగా వెళ్లిన స్కూల్‌ అసిస్టెంట్లకు నేటికీ జీతాలు అందడం లేదని, ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి ఉన్నత పాఠశాలలుగా అప్‌ గ్రేడ్‌ అయిన పాఠశా లలకు డిడిఒ కోడ్‌లు రాలేదని పేర్కొన్నారు. విద్యా ర్థుల సంఖ్య తక్కువగా ఉన్న ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుల పోస్ట్‌ లేని కారణంగా ఉపాధ్యాయులకు జీతాలు చేయడంలో ఉన్న సమ స్యలను పరిష్కరించలేదని తెలిపారు. పై సమస్యల పరిష్కారం కొరకు గురువారం సాయంత్రం నాలుగు గంటలకు కడప డిఈవో కార్యాలయం ఎదుట జరిగే నిరసన కార్యక్రమంలో ఉపాధ్యా యులు పెద్ద సంఖ్యలో హాజరు కావాల్సిందిగా కోరారు. సమావేశంలో యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విజయకుమార్‌, పాలెం మహేష్‌ బాబు, గౌరవ అధ్యక్షులు నాగార్జునరెడ్డి, ట్రెజరర్‌ నరసింహారావు, జిల్లా కార్యదర్శులు ఏజాస్‌ అహమ్మద్‌, శ్రీనివాసులు, మురళీకృష్ణ, సి.వి.రమణ, రాష్ట్ర కౌన్సిలర్‌ రూతు ఆరోగ్యమేరీ పాల్గొన్నారు.