Jul 20,2023 21:24

నిరసన తెలియజేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

 కడప అర్బన్‌ ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఉచితంగా ఇవ్వాలని అడిగితే ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని జిల్లా కార్యదర్శి సగిలి రాజేంద్ర ప్రసాద్‌ పేర్కొన్నారు. గురువారం తాడేపల్లిలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ కడప ఆర్ట్స్‌ జూనియర్‌ కళాశాల వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్‌ విద్యా ర్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు ఇవ్వాలని ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయం ముట్టడికి బయలుదేరిన నాయకులను పోలీసులు అడ్డుకుని అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని విమర్శించారు. కళాశాలలు ప్రారంభం అయి 48 రోజులు కావస్తున్నా ప్రభుత్వం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇవ్వాలని శాంతియుతంగా ఆందో ళనలు చేపడితే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్‌.ఎఫ్‌.ఐ నాయకత్వాన్ని ఎక్కడికక్కడ అరెస్ట్‌ చేయడం వైసిపి ప్రభుత్వానికి తగదని హెచ్చరించారు. వైసిపి ప్రభుత్వం అది óకారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తుందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు వెంటనే పాఠ్యపుస్తకాలు ఇవ్వాలని లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు సునీల్‌ కుమార్‌, విద్యార్థులు పాల్గొన్నారు. పోరుమామిళ్ల : ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు ఇవ్వాలని అడిగితే తాడేపల్లిలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వీరపోగు రవి తెలిపారు. గురువారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పోరుమామిళ్లలోని జూనియర్‌ కళాశాల వద్ద అక్రమ కేసులను నిరసిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ ఈ నె 19న ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చలో విజ యవాడలో భాగంగా ముట్టడి కార్యక్రమం చేపట్టరని విద్యార్థి నాయకులను అక్ర మంగా అరెస్టు చేసిన కేసులు సరికాదని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల అధ్యక్ష, కార్యదర్శి నగరికంటి సందీప్‌, జాల సుమంత్‌ మండల ఉపా ధ్యక్షులు వైష్ణవి, వంశీ, నవిత, వినరు కుమార్‌, సహాయ కార్యదర్శులు రమాదేవి, కరిష్మా ,మానస, అర్చన కమిటీ సభ్యులు తేజ్‌, శివ శంకర్‌, వెంకటేష్‌ పాల్గొన్నారు.