ప్రజాశక్తి - మంత్రాలయం
అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని జైభీమ్ ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ తెలిపారు. బుధవారం స్థానిక పోలీసు స్టేషన్‌లో ఎఎస్‌ఐ ఆనంద్ రెడ్డి జైభీమ్ ఎంఆర్‌పిఎస్ నాయకులను అరెస్టు చేయడంపై స్పందించారు. పత్తికొండ నియోజకవర్గంలో జూన్ 1న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉన్న సందర్భంగా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జై భీమ్ ఎంఆర్‌పిఎస్ నాయకులును అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రజల ఓట్లతో పాటు మాదిగల ఓట్లతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రికి మాదిగల సమస్యలు చెబుదామని అనుకుంటే ముందుగానే అరెస్టు చేయిస్తారా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తే ఏ మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో మాదిగలు సత్తా చూపిస్తామని, అక్రమ అరెస్టు, కేసులతో ఉద్యమాలను ఆపలేరని తెలిపారు. జై భీమ్ ఎంఆర్‌పిఎస్ నాయకులు హనుమన్న మాదిగ, సంగటి యోహాను, నియోజకవర్గ నాయకులు అనిల్, నరసింహులు, బాబు, గోపాల్ పాల్గొన్నారు.
నాయకులను అరెస్టు చేసిన పోలీసులు










