నాయకులను అరెస్టు చేసిన పోలీసులు
ప్రజాశక్తి - మంత్రాలయం
అక్రమ అరెస్టులతో ఉద్యమ నేతల గొంతులు నొక్కలేరని ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు. గురువారం ఎమ్మిగనూరు పట్టణంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ నేపథ్యంలో జైభీమ్ ఎంఆర్‌పిఎస్, నవ్యాంధ్ర ఎంఆర్‌పిఎస్, ఎంఆర్‌పిఎస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జైభీమ్ ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ, నవ్యాంధ్ర ఎంఆర్‌పిఎస్ జిల్లా అధ్యక్షులు రామతీర్థం అమ్రేష్, ఎంఆర్‌పిఎస్ నాయకులు నేపాల్ అలియాస్ రంగన్నను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. జైభీమ్ ఎంఆర్‌పిఎస్ నాయకులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అరెస్టు అయిన వారిలో జైభీమ్ ఎంఆర్‌పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమన్న మాదిగ ఉన్నారు.










