Nov 30,2022 23:46

నిరసన తెలియజేస్తున్న యుటిఎఫ్‌ నాయకులు, ఉపాధ్యాయులు

ప్రజాశక్తి-అచ్యుతాపురం
విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద సదస్సుకు హాజరైన యుటిఎఫ్‌ నాయకులు, కార్యకర్తలను, ఉపాధ్యాయులను అక్రమంగా అరెస్టు చేయడంపై ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ అచ్యుతాపురం మండలశాఖ ఆధ్వర్యాన బుధవారం విద్యా కేంద్రం ఆవరణలో ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమం చేపట్టారు. సదస్సుకు పోలీసుల అధికారులు ముందు అనుమతులు మంజూరు చేసి, తరువాత వాటిని రద్దు చేసి ఉపాధ్యాయులను అరెస్టు నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రేబాక రవికుమార్‌, సబ్బారపు నూకరాజు మాట్లాడుతూ ఉద్యోగులు నెల నెల తమ జీతం నుండి మినహాయించి ఎపిజిఎల్‌ఐ, జెడ్‌పిపిఎఫ్‌ తదితర ఖాతాల్లో నిల్వ చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఆ డబ్బుల నుండి వారి వ్యక్తిగత అవసరాల కోసం రుణం మంజూరు చేయకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైన పెండింగ్‌లో ఉన్న ఎపిజిఎల్‌ఐ, జెడ్‌పిపిఎఫ్‌ రుణాలు, మెడికల్‌ బిల్లులు, కరువు భత్యం బకాయిలు, లీవ్‌ ఎన్‌కాష్‌మెంట్‌ తదితర బిల్లలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ మండల నాయకులు కె.మురళీకృష్ణ, ఆర్‌ పైడిరాజు, ఎన్‌.శ్రీనివాస్‌ రాజు, కె.కరుణ కుమార్‌, పట్నాల రేఖ, చలమాన సత్యనారాయణ, కుమారి, ఝాన్సీరాణి, సూర్యలక్ష్మి, పివిఎస్‌ అప్పారావు పాల్గొన్నారు.