అక్రమ అరెస్టులపై కన్నెర చేసిన అంగన్వాడీలు
పట్టణంలో అంగన్వాడీల రాస్తారోకో.. స్థంభించిన ట్రాఫిక్
సమస్యలు పరిష్కరించాకుంటే ఆందోళన ఉదృతం చేస్తాం..
అంగన్వాడీల హెచ్చరిక..
అక్రమ అరెస్టులను ఖండించిన సిఐటియూ.
ప్రజాశక్తి, నంద్యాల కలెక్టరేట్
సమస్యల పరిష్కారం కోసం చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్ళనివ్వకుండా అడ్డుకొని అంగన్వాడీలను అరెస్టులు చేయడంపై అంగన్వాడి కార్యకర్తలు కన్నెర్ర చేశారు.సోమవారం నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో దాదాపు అరగంటసేపు రాస్తారోకో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ స్థంభించి వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయూయి..రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడి వర్కర్లు సమస్యలను పరిష్కారం చేయాలని చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిస్తే ఎక్కడికక్కడ అంగన్వాడీ కార్యకర్తలను, సిఐటియు నాయకులను అరెస్టు చేయడం దుర్మార్గమని సిఐటియు జిల్లా అధ్యక్షులు వి.ఏసురత్నం, జిల్లా ఉపాద్యక్షులు తోట.మద్దులు,పట్టణ అద్యక్ష,కార్యదర్శులు లక్ష్మణ్ కె.మహమ్మద్ గౌస్ లు అన్నారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయాలని కార్మికులు ఉద్యోగులు ప్రజలు ఆందోళనలు చేస్తుంటే ఉద్యమాలను అణిచివేయడం కోసం జీవో నెంబర్ 1 ను తెచ్చి ఉద్యమాలను అణిచివేయాలని చూడటం సి ఎం అవివేకమన్నారు.వెంటనే జీవో నెంబర్ ఒకటిని రద్దు చేయాలని, అంగన్వాడీ వర్కర్ల కు పనికి తగ్గట్టు వేతనాలు పెంచలని డిమాండ్ చేశారు. ఫెషియల్ హాజరు వలన తీవ్ర ఇబ్బందులు ఎదురౌతున్నాయని తక్షణమే ఈ విధానానికి స్వప్తి చెప్పాలన్నారు. అంగన్వాడీ లపై పనిబారం తగ్గించాలని, రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు.సమస్యలను పరిష్కారం చేయాలని లేకుంటే రాబోయే కాలంలో అంగన్వాడీ లు స్కిం వర్కర్లు,ఉద్యోగుల వ్యతిరేకతను వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మూటకట్టుకోవాల్సి వస్తుందన్నారు. రాస్తారోకో లో అంగన్వాడి కార్యకర్తలు జమ్రుద్ బేగం, అరుణ సరస్వతి, నాగేశ్వరితోపాటు అంగన్వాడీ కార్యకర్తలు, ఆయలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.










