ప్రజాశ-పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు ఐటీడీఏ ఎదురుగా గత 43 రోజులుగా తాము నిర్వహిస్తున్న శాంతియుత రిలే నిరాహార దీక్షలను పోలీసులు భగం చేయడం అప్రజాస్వామికమని ప్రజా సంఘాల ఐక్య వేదిక నాయకులు కూడా రాధాకృష్ణ, ప్రభుదాస్, పాలికి లక్కు, పృథ్వీరాజ్, సుందర్‌రావు తదితరులు విమర్శించారు. అర్ధాంతరంగా రిలే దీక్షలను పోలీసులు భగం చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. గిరిజన విద్యార్థుల మరణాల పై సరైన కారణాలను వెల్లడించని అధికారులు సమస్యల పరిష్కారం చేయలేకనే దీక్షలు భగం చేయించారని వారు ఆరోపించారు. ఈ సంద్భంగా వారు విలేకర్లతో మాట్లాడుతూ, అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాల్ని ఆపలేరన్నారు. ఉద్యమాలను అణిచి వేయడంపై ఉన్న శ్రద్ధ గిరిజన విద్యార్థుల మరణాల నివారణకు, గిరిజన సమస్యల పరిష్కారానికి చూపిస్తే బాగుండేదని సూచించారు. న్యాయబద్ధంగా, శాంతియుతంగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలను ఎలా భగం చేస్తారని, ప్రజాస్వామ్యంలో కనీసం నిరసన తెలుపుకునే అవకాశం కూడా లేకుండా చేయడం వైసీపీ ప్రభుత్వానికి తగదని మండిపడ్డారు. అక్రమ అరెస్టులు ఖండిస్తూ ఈనెల 31న అన్ని మండలాల్లో నిరసన, ఫిబ్రవరి 1న విద్యా సంస్థల బంద్‌కు సిద్ధపడాలని నాయకులు పిలుపునిచ్చారు.
విద్యార్థి మరణాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని విద్యార్థి మరణాలపై సమగ్ర విచారణ జరిపించాలని, గిరిజన సంక్షేమ ఆశ్రమ వసతి గహంలో తక్షణమే హెల్త్ అసిస్టెంట్లు నియమించి విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని హెల్త్ వాలంటీర్లను నియమించేంతవరకు పోరాటమాగదని ఉద్యమ స్వరూపాన్ని మార్చి ఉప్పెనల ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తామని హేచ్చరించారు. అదేవిధంగా తహసీల్దార్ మతిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులు ఎంతటి వారైనా కఠినంగా చర్యలు తీసుకోవాలని, ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యార్థి మరణాలపై సమగ్ర విచారణ జరిపించాలని ఆశ్రమాలు హాస్టల్స్లో హెల్త్ అసిస్టెంట్ నియమించాలని ప్రజా సంఘాలను మీడియా ప్రతినిధులను మీడియా ప్రతినిధులను ఆశ్రమల్లో సందర్శించడానికి అనుమతిస్తూ ఇవ్వాలని తల్లితండ్రులను విద్యార్థులతో తో మాట్లాడడానికి అవకాశం కల్పించాలని, పలు సమస్యలపై ఐటీడీఏకు వెళ్లే గిరిజనులను , మరియు గిరిజన ఉద్యోగులను వేధిస్తున్న ఐటీడీఏ పీవో రోనంకి గోపాలకష్ణను ప్రభుత్వం సరెండర్ చేయాలని, అదేవిధంగా డిగ్రీ ఇంటర్ అడ్మిషన్ ట్యూషన్ ఫీజులు తక్షణమే ఐటీడీఏ చెల్లించాలని వారు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. .
అనంతగిరి: అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంలో 43 రోజులుగా నిరసన చేపడుతున్న ప్రజా సంఘాల నాయకులకు అక్రమ అరెస్టు చేయడం అన్యాయమని సోమవారం మండల కేంద్రం అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజా సంఘాల నాయకులు ఎస్.నాగులు జె.సుబ్బారావు, రామకృష్ణలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పాఠశాలల్లో హెల్త్ వాలంటీర్లను ప్రభుత్వం వెంటనే నియమించాలన్నారు. అరెస్టులతో పోరాటాలు ఆగవని తెలిపారు. ఈ కార్యక్రమంలో టోకురు. సర్పంచ్ కె.మొస్య, సిహెచ్. మురళి, జె.భీమన్న, ఎన్.చిన్న గంగులు పాల్గొన్నారు.
ముంచింగిపుట్టు:అక్రమ అరెస్టులపై గిరిజన సంఘం మండల కార్యదర్శి శ్రీను మాట్లాడుతూ, శాంతి యుతంగా దీక్షలు చేస్తున్న ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులను పోలీసులు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆదేశాల మేరకే అరెస్టులు చేయడం సమంజసం కాదని మండిపడ్డారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలన్నారు. ఐటిడిఎ పిఒను సరెండర్ చేయాలన్నారు. గిరిజన విద్యార్థుల మరణాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీపురం సర్పంచ్ కొర్ర త్రినాథ్, సిపిఎం మండల కార్యదర్శి భీమరాజు పాల్గొన్నారు.
డుంబ్రిగూడ: ఐటీడీఏ ఎదుట చేపడుతున్న ప్రజా సంఘాల నాయకుల దీక్షను భగం చేసి అరెస్టు చేయడాన్ని గిరిజన సంఘం తీవ్రగా ఖండిస్తుందని ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు టి.సూర్యనారాయణ చెప్పారు. సోమవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ,గిరిజన ఆశ్రమ పాఠశాల వసతి గృహాల్లో సుమారు 15 మంది విద్యార్థులు అనారోగ్యంతో మృతి చెందారని, వీటిని అధికారులు. ప్రభుత్వం అరికట్టాల్సింది పోయి కక్షపూరితంగా వ్యవహరిస్తూ అరెస్టు చేయడం సరికాదన్నారు. తక్షణమే ఆశ్రమ పాఠశాలలో హెల్త్ వాలంటీర్లను నియమించాలని, లేకుంటే ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయ కులు పి.తిలక్, కె.నాయుడు, కె.రామదాసు, సీతారాం తదితరులు పాల్గొన్నారు.










