ప్రజాశక్తి-ఆలూరు
రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని, టిడిపి అధినేత చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని టిడిపి మైనార్టీ సెల్ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కెఎమ్‌డి.ఆదాం, టిడిపి చిప్పగిరి మండల కన్వీనర్ షేక్షావలీ తెలిపారు. టిడిపి ఇన్‌ఛార్జీ కోట్ల సుజాతమ్మ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన సామూహిక నిరాహార దీక్షలో ముస్లిం, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు జైలు నుంచి త్వరగా బయటకు రావాలని ముస్లిం, మైనార్టీలు ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చంద్రబాబుకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక జగన్ రెడ్డి కక్ష కట్టి బాబును జైలుకు పంపారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. టిడిపి మైనార్టీ నాయకులు మాలిక్, గజ్జెళ్లి మాబు సాబ్, నబిరసూల్, జిలాన్ బాష, పీరన్న, బషీర్ అహ్మద్, రాజా సాబ్, మోహన్, ఎంపిటిసి రహంతుల్లా, షేక్షావలీ, బషీర్ పాల్గొన్నారు.
ఆలూరులో ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు










