Sep 15,2023 22:28

బాధితులకు నిమ్మరసం అందిస్తున్న సిపిఎం నాయకులు

అధికారుల హామీతో..
అక్కుర్తి దళితుల దీక్ష విరమణ
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి
తాము సాగు చేసుకుంటున్న భూములపై అగ్ర కులస్తులకు అక్రమంగా జారీ చేసిన పట్టాలను రద్దు చేయాలంటూ స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట శ్రీకాళహస్తి రూరల్‌ మండలం అక్కుర్తి గ్రామ దళితులు నాలుగు రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్షను శుక్రవారం విరమించారు. సమస్యను పరిష్కరిస్తామంటూ స్థానిక ఎమ్మెల్యే, ఆర్డీవో, తహశీల్దార్‌ నుంచి స్పష్టమైన హామీ రావడంతో దీక్షను విరామిస్తున్నట్లు తెలియజేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అంగేరి పుల్లయ్య, పట్టణ బాధ్యుడు గంధం మణి బాధితులకు నిమ్మరసం అందించి దీక్షను విరమయింపజేశారు. పేదలు ఎక్కడ నిరాదరణకు గురైనా వారికి ఎర్ర జెండా అండగా ఉంటుందనీ, వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతుందని స్పష్టం చేశారు.
బాధితులకు నిమ్మరసం అందిస్తున్న సిపిఎం నాయకులు