
ప్రజాశక్తి - ఆకివీడు
ఆకివీడులో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం పడింది. సుమారు గంటపాటు కుండపోతు కురిసింది. పది రోజులుగా ఎండలు బాగా పెరిగిన నేపథ్యంలో జనం ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం పడడంతో వాతావరణం చల్ల బడింది. దీంతో ప్రజలు ఉపసమనం పొందారు. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పల్లపు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది.