రాయచోటి : దీపావళి పండుగ సామాన్య మధ్యతరగతి ప్రజలు చేసుకునేలా లేదు. టపాసుల ధరలు చూస్తే ముక్కున వేలు వేసుకోవాల్సిందే. బాణాసంచా ధరలు ఆకాశానంటుతుండటంతో అన్నమయ్య జిల్లాలో సందడి మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. గతంలో వారం, పది రోజుల ముండే దీపావళి పండుగ వాతావరణం కనిపించేది. వ్యాపారుల క్రాకర్స్ అమ్మకాలతో రాయచోటి పట్టణం నిండిపోయేది. ఈసారి దీపావళి పండుగ సమీపిస్తున్నా ఆ వాతావరణం కనిపించడంలేదు. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా తాత్కాలిక షాపులకు 330 అనుమతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రాయచోటి పట్టణంలోని గాలివీడు రోడ్డులోని గ్రౌండ్‌లో 26 దుకాణాలు ఏర్పాటు చేశారు. లైసెన్స్ పొందాలంటే గత సంవత్సరం రాయచోటి జిల్లా కేంద్రం కావడంతో అధిక శాతం ఛార్జీలు పెంచారు. నేడు, రేపు ఈ దుకాణాలన్నీ ఆయా చోట్ల నడుపుకోవాల్సి ఉంటుంది. లైసెన్సు ఫీజులను భారీగా పెంచేయడంతో గత ఏడాది రోజుకు రూ.300 స్ధలానికి బాదుగు ఉండేది. ఇప్పుడు రోజుకు రూ. వెయ్యి వరకు వసూలు చేస్తున్నారు. భారీ స్థాయిలో పెంచేశారంటూ పలువురు బాణసంచా వ్యాపారులు తీవ్ర ఆవేదనకు వ్యక్తం చేస్తున్నారు. రూ. లక్షలు ఖర్చు చేసి స్టాల్స్ ఏర్పాటు చేసుకున్నారు. గతంలో అత్యంత తక్కువ ధరలకు చైనా నుంచి బాణసంచాలు నాణ్యతని వచ్చేవి. ఈ సారి చైనా బాణసంచా తయారీని ఆ దేశంలో నిషేధించడంతో పూర్తిగా స్వదేశీ బాణసంచా అమ్మకాలే నిర్వహిస్తున్నారు.పైగా బాణసంచా ధరలు ఈ ఏడాది 20 శాతం పెరిగాయని పలువురు చెబుతున్నారు. ఈ ప్రభావం తీవ్రంగా ప్రజలపై పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు దీనిపై స్పందించి సరైన ధరలకు బాణాసంచాలను అమ్మకాలు చేసే విధంగా చర్య తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం
వ్యాపారులు అధిక రేటుకు అమ్ముతున్నారని ప్రజలు ఎవ రైనా ఫిర్యాదు చేస్తే రెవెన్యూ, పోలీస్, తమ అగ్నిమాపక సిబ్బందితో కలిసి చర్య తీసుకోవడానికి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. దీపావళి పండుగ ప్రశాంతంగా నిర్వహించుకోవడానికి అన్ని చర్యలు తీసుకున్నాం.
- పి.అనిల్‌కుమార్, జిల్లా అగ్నిమాపక అధికారి, రాయచోటి, అన్నమయ్య జిల్లా.