May 02,2023 17:17

మాట్లాడుతున్న ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజశేఖర్‌

అకాల వర్షానికి నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి
- ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజశేఖర్‌

ప్రజాశక్తి - పాములపాడు

అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలకు రైతులకు నష్టపరిహారం చెల్లిం చాలని ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏ రాజశేఖర్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం పాములపాడు రైతు సంఘం మండల కార్యదర్శి వెంకటేశ్వర రావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. జిల్లాలో అకాల వర్షం పడటం వలన నంద్యాల ప్రాంతంలోని అరటి, మామిడి, పసుపు, వరి వంటి పంటలకు తీవ్రంగా నష్టం వాటిలిందని రైతులకు పరిహారం చెల్లించాలన్నారు. ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. బిజెపి ప్రభుత్వం రైతులకు మోటార్లకు మీటర్లు విధానం వెనక్కి తీసుకోని, నల్ల చట్టాలను పూర్తి రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. పాములపాడు స్థానిక సమస్యలు పరిష్కరించాలన్నారు. పాములపాడు మెట్ట ప్రాంతానికి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం సీనియర్‌ నాయకులు బి.రామేశ్వరరావు, కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సామన్న, బాలయేసు, రవణమ్మ, రంగస్వామి, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.