Apr 02,2023 01:08
తహశీల్దారు లక్ష్మీనారాయణ దంపతులను సన్మానిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-మద్దిపాడు: స్థానిక తహశీల్దారు జె లక్ష్మీనారాయణ అజాత శత్రువు, మిత భాషి అని ఇనమనమెల్లూరు ఎంపీటీసీ సభ్యులు వాకా కోటిరెడ్డి తెలిపారు. స్థానిక కల్యాణ మండపంలో ఆయనకు ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు. తహశీల్దారు దంపతులను సన్మానించారు. కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్‌ అప్పారావు, పోతినేని శ్రీనివాసరావు, బెజవాడ రాము, కార్యాలయ సిబ్బంది డీటీమీనా ఎంఆర్‌ఐ వెంకటేశ్వర్లు, అనూష, విఆర్‌ఓలు రమణ తదితరులు పాల్గొన్నారు.