ప్రజాశక్తి-యంత్రాంగం
స్వాతంత్య్ర సమరయోధుడు, భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ ఆజాద్ సేవలు చిరస్మరణీయమని అన్నారు.
కాకినాడ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశానికి అందించిన సేవలు అమూల్యమైనవని జిల్లా రెవెన్యూ అధికారి కె.శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టర్ కార్యాలయం విధాన గౌతమి సమావేశ మందిరంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని డిఆర్‌ఒ కె.శ్రీధర్ రెడ్డి మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశ తొలి విద్యా శాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యారంగానికి అందించిన సేవలకు గుర్తుగా ఆయన జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. భారతదేశానికి మొదటి ఉప రాష్ట్రపతిగా కూడా ఆయన సేవలందించారని, మైనారిటీ, వెనుకబడిన వర్గాల విద్య, జాతీయాభివద్ధి, సంస్థల బలోపేతానికి ఆయన విశేష కషి చేశారని అన్నారు. కార్యక్రమంలో జిల్లా మైనారిటీ వక్ఫ్ బోర్డు ప్రెసిడెంట్ రెహమాన్ ఖాన్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడరూరల్ సర్పవరం జంక్షన్ లో బోటు క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో విద్యా వేత్త మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ని రిటైర్డ్ ఉపాధ్యాయులు నిమ్మకాయల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుడు, పండితుడు, భారత ప్రభుత్వ తొలి విద్యా శాఖ మంత్రి అయిన అబుల్ కలాం ఆజాద్ 1888 నవంబర్ 11న జన్మించారని అన్నారు. ఆయన జయంతినిజాతీయ విద్యా దినోత్సవం గా 2008 నుంచి జరుపుకుంటున్నామని అన్నారు. మహిళలకు విద్యా అవకాశాలను కల్పించడంతోపాటు 14 సంవత్సరాల వయస్సు పిల్లలకు ఉచిత విద్యను అందించారని అన్నారు. స్వాతంత్య్ర భారతదేశంలో విద్యావ్యవస్థను అభివద్ధి చేయడంలో విద్యా వేత్త మౌలానా అబుల్ కలాం ఆజాద్ ముఖ్యమైన పాత్ర పోషించారని అన్నారు. ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన పిల్లలకు స్కాలర్‌షిప్ల్, స్టైఫండ్లు ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. భారతరత్న పురస్కారాన్ని అందుకున్న ఆజాద్ విద్యారంగంపై మక్కువ కలిగి సమాజంలో మరింత సోదర భావాన్ని పెంపొందించేందుకు విశేష కృషి చేశారనితెలిపారు. తొలుతుగా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిం చారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, జీ .కష్ణమోహన్, రాఘవరావు, చింతపల్లి సుబ్బారావు, రాజా తదితరులు పాల్గొన్నారు. కాకినాడరూరల్ స్థానిక రూరల్ వైసిపి కార్యాలయంలో కాకినాడ రూరల్ ఎంఎల్‌ఎ కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో భారతరత్న విద్యావేత్త, మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యులు సభ్యులు నూరుకుర్తి రామకష్ణ, కాకినాడ జిల్లా వాకఫ్ బోర్డు అధ్యక్షులు రెహమాన్ ఖాన్, వాకఫ్ బోర్డు జిల్లా కార్యదర్శి కరీం బాషా, నేమాం సర్పంచ్ రామదేవ్ సూర్యప్రకాశరావు తదితరులు పాల్గొని అబ్దుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పెద్దాపురం మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ బొడ్డు తులసి మంగతాయారు, వైస్ ఛైర్మన్లు నెక్కంటి సాయి ప్రసాద్, కనకాల మహాలక్ష్మి, మున్సిపల్ మేనేజర్ జ్యోతీ రాణి, డిఇఇ ఆదినారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.