ప్రజాశక్తి-జగదాంబ : ఐద్వా జగదాంబ జోన్ ఆధ్వర్యంలో పంది మెట్ట ప్రాంతంలో మీటర్లు బిగించిన కుళాయిల ద్వారా తమకు నీళ్లు వద్దని పాత పద్ధతిలోనే కొళాయిలు ఇవ్వాలని ఏఈ ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐద్వా జోన్ అధ్యక్షులు మణి మాట్లాడుతూ కొళాయిలకి మీటర్లు బిగించి మొదటి మూడు నెలలు ఉచితం అని చెప్పి ఆ తర్వాత విపరీతంగా చార్జీలు వేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని అన్నారు. త్రాగే నీరుపై ఈ రకమైన వ్యాపార ధోరణి ప్రభుత్వాలకు తగదని వెంటనే ఈ మీటర్ల పద్ధతిని తొలగించి పాత పద్ధతులొనే కుళాయిలు ఇవ్వాలని ఏ.ఈ ని కోరారు. ఏఈ సానుకూలంగా స్పందిస్తూ పాత పద్ధతిలోనే కొళాయిలు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఐద్వా సభ్యులు లక్ష్మీ, సరస్వతి, ఆదిలక్ష్మీ, సీతారత్నం, పుష్ప, బుజ్జి, మణి మరియు స్థానికులు పాల్గొన్నారు.










