ప్రజాశక్తి - సీతంపేట : స్థానిక ఐటిడిఎలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పిఒ కల్పనా కుమారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులలు పోలీసులచే గౌరవ వందనం స్వీకరించారు. మీటింగ్ హాల్లో విద్యార్థుల సంస్కతి కార్యక్రమాలు తిలకించారు విద్యార్థులు గాంధీజీ, అల్లూరి సీతారామరాజు ప్రముఖులు వేషధారణలో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వి కళావతి, మాట్లాడుతూ గిరిజన అభివద్ధి కోసం ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. పిఒ కుమారి మాట్లాడుతూ గ్రామాల్లో ఇప్పటికే రహదారులు,తాగునీటి సమస్య వంటివి పరిష్కారానికి చర్యలు చేపట్టామని అన్నారు. అనంతరం ఐటిడిఏ పరిధిలో వివిధ శాఖల్లో ఉద్యోగాలు నిర్వహిస్తున్న ఉత్తమ అధికారుల సేవలు గుర్తించి పిఒ, ఎమ్మెల్యే వి.కళావతి చేతుల మీదుగా 198మందికి అవార్డులు అందించారు. కార్యక్రమంలో ఎపిఒ రోషిరెడ్డి, డిడి బి శ్రీనివాసరావు, ట్రైబల్ వెల్ఫేర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సింహాచలం, డిప్యూటీ డిఇఒ లిల్లీ రాణి, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ చిరంజీవి సూపర్డెంట్ దేశ్ తదితరులు పాల్గొన్నారు.










