Sep 04,2023 22:02

    టి.నరసాపురం : ఐటీ నోటీసులతో చంద్రబాబు నాయుడు అవినీతి బట్టబయలైందని పోలవరం నియోజకవర్గ ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు విమర్శించారు. మండలంలోని అప్పలరాజుగూడెంలో సోమవారం నిర్వహించిన 'గడపగడపకూ మన ప్రభుత్వం' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణం పేరుతో రూ.118 కోట్లు దోచుకున్నాడని, అందుకు ఐటి నోటీసులు జారీ చేసిందని తెలిపారు. ఐటి నోటీసులతో చంద్రబాబు అవినీతి బయట పడిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ డి.లక్ష్మి వెంకటేశ్వరరావు, వైసిపి మండల కన్వీనర్‌ శ్రీను రాజు, ఎంపిటిసి కె.రామ భాస్కర్‌ రెడ్డి పాల్గొన్నారు.