ప్రజాశక్తి-మధురవాడ : మధురవాడ ఎస్సి కళాశాల వసతి గృహం సమస్యలు పరిష్కరించాలని ఎం.వి.ఫై వద్ద ఉన్న ఎస్సి సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద జాయింట్ డైరెక్టర్ రమణమూర్తికి కలిసి AISF అధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా AISF జిల్లా అధ్యక్షకార్యదర్శులు నాగరాజు,ఫణీంద్ర కుమార్ మాట్లాడుతూ విశాఖ జిల్లా మధురవాడ వద్ద ఉన్న SC కళాశాల వసతి గృహంలో విద్యార్థులు అనేక సమస్యల పట్ల ఇబ్బంది పడుతున్నారు. వసతి గృహంలో మరుగుదొడ్ల పరిశుభ్రత పాటించడంలో కాని, ఆహార నాణ్యతలో కానీ, మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా స్థానిక HWO నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీని వలన విద్యార్థులు తీవ్ర ఇబ్బంది గురవుతున్నారు. కాబట్టి తక్షణమే ఉన్నంత అధికారులు అక్కడ ఉన్న సమస్యను పరిష్కరించే విధంగా స్థానిక HWO పైన చర్యలు తీసుకోవాలని AISF గా డిమాండ్ చేస్తున్నాం. లేనిపక్షంలో సమస్యల పరష్కారానికై విద్యార్ధులని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిక జారీ చేశారు. ఈ కార్యక్రమంలో AISF నాయకులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.










