సత్తెనపల్లి: సమగ్ర శిశు అబివృద్ధి పథకం ఐస ిడిఎస్ ను పరిరక్షించాలని, బడ్జెట్‌లో నిధులు పెంచాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యూటి ఇవ్వాలని, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు మల్లేశ్వరి ప్రభుత్వాన్ని డిమా ండ్ చేశారు. అఖిలభారత కోర్కెల దినోత్స వాన్ని పురస్కరించుకొని జూలై 10, 11 తేదీలలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే నిరసన కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ పాల్గొని జయప్రదం చేయాలని ఆమె పిలుపు నిచ్చారు. ఈ మేరకు బుధవారం స్థానిక పుతుంబాక భవన్‌లో జరిగిన సంఘం జిల్లా విస్తృత సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రచార కరపత్రాన్ని ఆవి ష్కరించారు. ఈ సమావేశానికి ఎస్ అహల్య అధ్యక్షత వహించారు. మల్లేశ్వరి మాట్లాడుతూ కొనసాగిస్తూ ఐసిడిఎస్ లక్ష్యానికి విరుద్ధంగా నూతన విద్యా విధా నాన్ని తీసుకువచ్చిందని విమర్శించారు. యూనియన్ నిర్వహించిన అనేక పోరా టాల ఫలితంగా 2018 లో అంగన్వాడి వర్కర్లకు రూ.1500, హెల్పర్ కు రూ.750, మినీ వర్కర్లకు రూ.1250 పెంచుతున్నామని ప్రకటించినా ఇంత వరకూ అమలు చేయలేదని విమర్శిం చారు.
2017 నుండి టిఎ బిల్లులు ఇవ్వలేదని, ఏప్రిల్ 25న అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులకు 1972 చట్టం ప్రకారం గ్రాడ్యుటీకి అర్హులని తెలియ జేసింది కానీ అమలు చేయ లేదని, ప్రైవేటీకరణ విధానంలో భాగంగా రక రకాల యాపులు తెచ్చి పని భారం పెంచుతోందని విమర్శించారు. అంగ న్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ కన్నా అదనంగా వేత నాలు పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని, వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని మొదలైన డిమాండ్లు చేశారు. సమా వేశంలో సత్తెనపల్లి ప్రాజెక్ట్ అధ్యక్ష కార్యదర్శులుగా ఎస్.కె.సుజాత, ఎస్ అహల్య, కోశాధికారిగా ఎన్ జ్యోతి ని ఎన్నుకోవడం జరిగింది. తసమావేశంలో ఫిరంగిపురం ప్రాజెక్టు కార్యదర్శి ధనలక్ష్మి అంగన్వాడి వర్కర్స్ అంజలి, జ్యోతి పాల్గొన్నారు.










