Apr 29,2023 00:37

సిబ్బంది తో మాట్లాడుతున్న జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి

ప్రజాశక్తి-మాడుగుల: ఐరన్‌ మాత్రల పంపిణీ పక్కాగా అమలు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి హేమంత్‌ సూచించారు. శుక్రవారం మండలంలోని కెజె పురం, కింతలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడుతూ, సెలవుల దృష్ట్యా పాఠశాలల విద్యార్థులకు ఐరన్‌ మాత్రలను వారి ఇళ్లకు వెళ్లి ఇవ్వాలని ఆదేశించారు. విద్యార్థుల్లో ఎవరికి ఐరన్‌ లోపం లేకుండా మాత్రల పంపిణీ పక్కాగా జరగాలని ఆదేశించారు. ఎంకే వల్లాపురం గ్రామంలో శుక్రవారం జరిగిన ఫ్యామిలీ ఫిజీషియన్‌ కాన్సెప్ట్‌ పరిశీలించారు.పథకాలు అమలు తీరు, ఇబ్బందులు తదితర విషయాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు ప్రసాదు పాత్రుడు, లీలా ప్రసాద్‌, ఆరోగ్య విస్తరణ అధికారి రవికుమార్‌, కింతలి వైద్యాధికారి కేఎం నాయుడు సిబ్బంది పాల్గొన్నారు.