Aug 01,2021 13:55

న్యూఢిల్లీ : ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలిలో భారత్‌కు ఆగస్టు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు అధ్యక్ష బాధ్యతలను భారత ప్రతినిధి తిరుమూర్తి స్వీకరించారు. ఐరాస భద్రతా మండలిలో నెలకొక దేశం అధ్యక్ష బాధ్యతలు చేపడుతోంది. ఈ బాధ్యతలను శాశ్వత, తాత్కాలిక సభ్య దేశాలు చేపడుతున్నాయి. 2021-22 ఏడాదికి తాత్కాలిక సభ్య దేశంగా భారత్‌ ఎన్నికైంది. జులై నెలలో అధ్యక్ష బాధ్యతలను నిర్వహించిన ఫ్రాన్స్‌ నుంచి భారత్‌ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించింది. వచ్చే ఏడాది డిసెంబర్‌లోనూ భారత్‌ మరోమారు అధ్యక్ష బాధ్యతలను చేపట్టనుంది. సముద్ర భద్రత, శాంతి పరిరక్షణ, ఉగ్రవాద కట్టడిపై దఅష్టి సారిస్తామని భారత ప్రతినిధి తిరుమూర్తి తెలిపారు. ఆయా అంశాలపై ఈ నెలలోనే సంతకాల సేకరణ చేపడుతామని ప్రకటించారు. సభ్య దేశాలతో భారత్‌ సమన్వయంతో పని చేస్తుందని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ ప్రకటించారు.