
ప్రజాశక్తి - భట్టిప్రోలు
రేపల్లె డివిజన్ బట్టిప్రోలు మండలం ఐలవరం క్లస్టర్ పరిధిలో గురువారం సేంద్రియ ఎరువు తయారీ ప్రయోగం చేపట్టారు. గ్రామంలోని స్నేహ వివో రాజ్యలక్ష్మి ఇప్పటికే రసాయన ఎరువులు లేకుండా సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేపట్టారని తెలిపారు. దీనికి గాను 100కేజీల పశువుల పేడలో రెండు కేజీల శనగపిండి, రెండు కేజీల నల్ల బెల్లం, గుప్పెడు పుట్టమన్ను, తగినన్ని గోమూత్రం వినియోగించి తయారుచేసిన దానిని ఎకరాకు 400కేజీల చొప్పున మూడు విడతలుగా పొలంలో చల్లితే ఎలాంటి రసాయన ఎరువు లేకుండా సేంద్రియ పద్ధతిలో ఉత్తమ పంటలను సాధించవచ్చునని ఎంసిఆర్ పాండురంగారావు సూచించారు. కార్యక్రమంలో ఎస్‌హెచ్‌జి గ్రూపు మహిళలు ఉన్నారు.