ప్రజాశక్తి-గుంటూరు లీగల్ : ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఐలు) గుంటూరు నగర నూతన కమిటీ ఎన్నికైంది. జిల్లా అధ్యక్షులు డాక్టర్ సయ్యద్‌బాబు అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో 30 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. నగర అధ్యక్షులుగా గండికోట శేషగిరిరావు, ప్రధాన కార్యదర్శిగా పులి ప్రత్యూష, కార్యదర్శులుగా ఆళ్ల ప్రశాంత్, రషీద్, ఉపాధ్యక్షులుగా ఖాజావలి షేక్, గర్నెపూడి సురేష్, సంయుక్త కార్యదర్శులుగా ఆకుమళ్ల ఖాసిం, కోశాధికారిగా గోళ్ల వెంకట మాధుర్‌ను ఎన్నుకున్నారు. న్యాయ విద్యార్థుల విభాగం నగర అధ్యక్షులుగా కొమ్ము తరుణ్, ప్రధాన కార్యదర్శిగా ఈమని సతీష్, ఉపాధ్యక్షులుగా శివకృష్ణ ఎన్నికయ్యారు. నూతన కమిటీ న్యాయవాదుల సమస్య లపై, న్యాయవిద్యార్థుల సమస్యలపై, న్యాయవాదుల ఉపాధి, రక్షణ, న్యాయ రంగంలో వస్తున్న మార్పులు, మానవ హక్కుల రక్షణ, రాజ్యాంగ, ప్రజాస్వామ్య రక్షణ, మహిళా న్యాయవాదులకు కనీస సౌకర్యాల కల్పన తదితర విషయాలపై చర్చించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తుందని నాయకులు తెలిపారు.










