కడప అర్బన్ : పాలస్తీనా-ఇజ్రాయిల్ యుద్ధం ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని ఆపాలని ఆవాజ్ కమిటీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చాంద్‌బాషా, ఫారుక్ హుస్సేన్ కోరారు. బుధవారం ఆవాజ్ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమా వేశంలో వారు మాట్లాడుతూ 1945 రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ అధ్య క్షుడు హిట్లర్ 60 లక్షల మంది యూదులను అతి కిరాతకంగా హత్యలు చేయించి వారిని అంతమందించాడని తెలిపారు. కొంతమంది యూదులను ప్రాణభక్షపెట్టి వదిలేశాడని పేర్కొన్నారు. 1947లో పాలస్తీనా ప్రజలు మానవతా దక్పథంతో ఆ యూదులను తలదాచుకొనుటానికి దేశంలోకి అనుమతించి విశాల హదయంతో వారికి స్థలాలు, ఇండ్లు కేటాయించి వారికి ఓ కొత్త జీవితం ప్రసాదించారని చెప్పారు. కానీ కతజ్ఞత మరిచిన యూదులు పాలస్తీనా ప్రజల భూములు ఆక్రమించుకుని వారి ఇళ్లను ధ్వంసం చేస్తున్నారని పేర్కొన్నారు. పాలస్తీనీలను చిన్న పెద్ద అని చూడకుండా, ఆసుపత్రులులో రోగులు ఉంటారని కనికరం లేకుండా బాంబులు వేసి పాశవికంగా హత మారుస్తున్నారని తెలిపారు. పాలస్తీని ప్రజలు సర్వం కోల్పోయారని చెప్పారు. ఇప్పటికే ఇరుదేశాలలో వేలాదిమంది చనిపోయారని పేర్కొన్నారు. లక్షలాది మంది ప్రజలు తమఇండ్లను కోల్పోయి నిరుస్రాయులయ్యారని తెలిపారు. ఈ శత్రుత్వాలకు మానవతావాద పరిస్థితి చాలా భయంకరంగా ఉన్నదని, విద్యుత్,ఆహారం, నీరు,మందులు, గ్యాస్,దొరకక అక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకుని చర్చలు జరిపి ఈ యుద్ధం ఆపాలని కోరారు. సమావేశంలో ఆవాజ్ జిల్లా కార్యవర్గ సభ్యులు సత్తార్, మాబుతారా, షరీఫ్, ఖాదర్ బాషా, మహబూబ్ బాషా పాల్గొన్నారు.










