ప్రజాశక్తి - ఆరిలోవ : బాల వికాస్ ఫౌండేషన్, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ రిలీజియన్ ఫ్రీడమ్ సంస్థల ఆధ్వర్యాన ప్రభుత్వ బాలికల గృహంలో ఐక్యరాజ్య సమితి అవిర్భావ దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాగార్జున యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్సలర్ వి.బాలమోహన్ దాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా శాంతిని నెలకొల్పి, అన్ని దేశాల్లో సుస్థిరతను కాపాడేందుకు యుఎన్‌ఒ కృషి చేస్తుందన్నారు. బాల వికాస్ ఫౌండేషన్ చైర్మన్ నరవ ప్రకాశరావు మాట్లాడుతూ, యుఎన్‌ఒ, దాని అనుబంధ సంస్థల సేవలు, లక్ష్యాలను వివరించారు. గాంధీ - శాంతి అనే అంశంపై ప్రధాన మంత్రి సమక్షంలో పార్లమెంటులో ప్రసంగించిన సెయింట్ జోసెఫ్ విద్యార్థిని సునధిరారును సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో సెయింట్ జోసెఫ్ కాలేజీ ఎన్‌ఎస్‌ఎస్ ప్రొగ్రాం అధికారి డాక్టర్ మాణిక్యకుమారి, ఎస్‌వివిపివి ఎంసి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్.జగదీశ్వరరావు, హోం అధికారి సునీత, డాక్టర్ బాబ్జి పాల్గొన్నారు.










