ఐద్వా పతాకాన్ని ఆవిష్కరిస్తున్న నేతలు
ప్రజాశక్తి- గాజువాక : అవిశ్రాంత పోరాటం, త్యాగాలతో నిర్మించుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణకు ఆపాలంటే ఐక్యపోరాటాలు అవసరమని ఐద్వానేతలు పిలుపునిచ్చారు. అఖిల భారత ఐద్వా మహాసభల సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా గురువారం గంగవరం గాంధీ బొమ్మ జంక్షన్, పెదగంట్యాడ హెచ్‌బి కాలనీ కూడలిలో ఐద్వా పతాకావిష్కరణలు చేపట్టారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ప్రధా కార్యదర్శి వై సత్యవతి మాట్లాడుతూ, ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటంలో మహిళలు, నిర్వాసితులు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐద్వా స్టీల్‌జోన్ కార్యదర్శి పి వేణు, ఐద్వా నేతలు వై సంధ్య, సిహెచ్ రేణుక, కె.లక్ష్మి పాల్గొన్నారు.










