Jun 07,2023 00:28
నూతన కమిటీతో సిఐటియు నాయకులు ఎన్‌ బాబురావు

ప్రజాశక్తి-చీరాల: కార్మికుల సమస్యల పరిష్కారం ఐక్య పోరాటాలతోనే సాధ్యమని అధిక కార్మికులందరూ సంఘటితంగా పోరాటాలకు కృషి చేయాలని సిఐటియు నాయకులు ఎన్‌ బాబురావు అన్నారు. స్థానిక కొత్తపేట పంచాయతీ కార్యాలయంలో నూతన కమిటీ ఎన్నిక మంగళవారం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ గ్రామ పంచాయతీ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ కొత్తపేట గ్రామ నూతన అధ్యక్ష కార్యదర్శులుగా కాటి దానమ్మ, అంబటి చందు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొత్తపేట పంచాయతీ ఆఫీస్‌ వద్ద కార్మికుల జనరల్‌ బాడీ మీటింగ్‌ జరిగింది. ఈ సందర్భంగా కార్మికులు ఎదుర్కొనే అనేక రకాల సమస్యలపై పలు తీర్మానాలు ఆమోదించి రానున్న కాలంలో సమస్యలపై పోరాటానికి సిద్ధపడనున్నట్లు తెలియజేశారు. అనంతరం స్థానికంగా కార్మికులు ఎదుర్కొనే సమస్యలను పంచాయతీ కార్యదర్శి బడుగు రమేష్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఎన్‌ బాబురావు, మరియు పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.