Sep 23,2023 21:33

బద్వేల్‌ : బైక్‌ జాతా నిర్వహిస్తున్న యుటిఎఫ్‌ నాయకులు

 చాపాడు : ఉద్యోగ, ఉపాధ్యాయులకు శాపంగా మారిన జిపిఎస్‌ను రద్దు చేయించి ఒపిఎస్‌ను కచ్చితంగా సాధించుకుందామని అందుకు ఉపాధ్యాయులు ఐక్య ఉద్యమాలకు సిద్ధంగా కావాలని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు నక్క వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. యుటిఎఫ్‌ 50వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం మైదుకూరులో వేడుకలను ఘనంగా నిర్వ హించారు. మైదుకూరులోని ఉర్దూ హైస్కూల్‌ ఆవరణలో జిల్లా అధ్యక్షులు విజరు కుమార్‌ యుటిఎఫ్‌ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బద్వేల్‌ మీదుగా బైక్‌ ప్రచార యాత్రను కొనసా గించారు. ఈ సందర్భంగా యూటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ 'విద్యారంగాన్ని కాపాడు కుందాం.. పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధ రించుకుందాం' అనే నిదానంతో రాష్ట్ర వ్యాప్తంగా రెండు టీమ్‌ల ఆధ్వర్యంలో బైక్‌ జాతా కొనసా గుతుందన్నారు. అక్టోబరు 1న విజయవాడలో సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహించే స్వర్ణోత్సవ వేడుకలను జయప్రదం చేయాలని కోరారు. ప్రజా సంకల్ప యాత్రలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఉపాధ్యాయులకు ఇచ్చిన మాట తప్పారన్నారు. జిపిఎస్‌ రద్దుచేసి ఒపిఎస్‌ అమలు చేస్తామని హామీ ఇచ్చి నేడు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒపిఎస్‌ సాధనకు ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఉద్యో గులకు ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే 2024 ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. 49 సంవత్సరాలుగా తెలుగుజాతి కలిసికట్టుగా ఉండాలని పోరాటం సాగిస్తున్న ఏకైక ఉపాధ్యాయ సంఘం యుటిఎఫ్‌ అన్నారు. అక్టోబర్‌ 1న 17వేల మందితో విజయవాడలో రాబోయే రోజుల్లో చేప ట్టబోయే కార్యక్రమాలపై చర్చిస్తామని తెలిపారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ నాయకులు మహేష్‌ రవికుమార్‌, సద్దాం పాల్గొన్నారు. కార్యక్రమంలో యూటిఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేష్‌ కుమార్‌, జిల్లా అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు విజరు కుమార్‌, మహేష్‌ బాబు, నాగార్జునరెడ్డి, రవికుమార్‌, రవీ ంద్రుడు, మురళీకష్ణ ,ప్రభాకర్‌, సివి రమణ, అనిల్‌ కుమార్‌, వనమాల రాము, జబ్బర్‌, చంద్రశేఖర్‌, సుబ్బారెడ్డి, జానకిరామ్‌, మల్లిఖార్జున, రమాదేవి పాల్గొన్నారు. బద్వేలు : ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించుకొనేందుకు యుటిఎఫ్‌ నాయకులు, కార్యకర్తలు పాటుపడాలని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. యుటిఎఫ్‌ స్వర్ణోత్సవ వేడుకల ప్రారంభ ఉత్స వాలను పురస్కరించుకొని చేపట్టిన రాష్ట్రవ్యాపిత బైక్‌ జాతా కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం బద్వేల్‌కు చేరుకుంది. చెన్నంపల్లె వద్ద యుటిఎఫ్‌ నాయకులు బైక్‌ జాతాకు ఆహ్వానం పలికి, పట్టణంలో భారీ మోటార్‌ బైక్‌ ర్యాలీ నిర్వహి ంచారు. జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల వద్దకు చేరుకుని యుటిఎఫ్‌ సీనియర్‌ నాయకులు ఓబుల్‌ రెడ్డిచే యుటిఎఫ్‌ పతాకాన్ని ఆవిష్క రించారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ రాష్ట్ర సహాధ్య క్షులు కె.సురేష్‌ కుమార్‌, బద్వేల్‌, గోపవరం, పోరుమామిళ్ల, కాశినాయన మండలాల అధ్యక్షులు టి.శివ ప్రసాద్‌, వీర దాసరి క్రిస్టఫర్‌, ఈశ్వరరావు, భాస్కర్‌ రెడ్డి, నాయకులు చంద్రశేఖర్‌, రామచంద్రయ్య, సుధాకర్‌, పి.శ్రీనివాసరెడ్డి, ఎస్‌.మస్తాన్‌ వలి, కొండయ్య పాల్గొన్నారు. కడప అర్బన్‌ : యుటిఎఫ్‌ స్వర్ణోత్సవాల సంబరాల్లో భాగంగా శనివారం కడపలో జరిగిన బైక్‌ జాతాలో యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. రాజంపేట రోడ్డులోని వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ నుంచి వై జంక్షన్‌, యర్రముక్కపల్లి సర్కిల్‌ మీదుగా బాలాజీ నగర్‌లోని యుటిఎఫ్‌ భవన్‌ వరకు జాతా నిర్వహించారు. యుటిఎఫ్‌ భవన్‌ వద్ద జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్‌ బాబు జెండా ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు, సహాధ్యక్షులు కె. సురేష్‌ కుమార్‌ మాట్లాడుతూ కార్యక్రమంలో గోపినాథ్‌, కిరణ్‌ కుమార్‌, చంద్ర శేఖర్‌, విజయ కుమార్‌, జానకి రామ్‌, నాగరాజు, హిపాజితుల్లా, జి.వెంకట సుబ్బయ్య, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కోశాధికారి రాజశేఖర్‌ రాహుల్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముడియం చిన్ని, వీరనాల శివకుమార్‌,డి. నగర కార్యదర్శి ఎం.ఓబులేసు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గండి సునీల్‌ కుమార్‌, సగిలి రాజేంద్ర జాతాకు ఆహ్వానం పలుకుతూ సంఘీభావం తెలియజేశారు.