కడప అర్బన్ : 'నా మట్టి నా దేశం'తో ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తిని పెంపొందించేందుకు, ఐకమత్యం సాధ్యమవుతుందని డిఆర్‌ఒ గంగాధర గౌడ్ అన్నారు శుక్రవారం భారత ప్రభుత్వ కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల మంత్రిత్వ శాఖ,నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల కళాశాలలో నా మట్టి, నా దేశం అమత్ కలశ యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డిఆర్‌ఒ మాట్లాడుతూ భారతదేశ చరిత్ర, సంస్కతి, సంప్రదాయాలు ఎంతో ఘనమైనవి, ఇటువంటి దేశం లో మనం పుట్టడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. జిల్లాలో అనేక ప్రదేశాలలో అమత్ కలశ యాత్ర నిర్వహించడం సంతోషకరమన్నారు. నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువ అధికారి కె.మణికంఠ మాట్లాడుతూ ప్రతి గ్రామం నుంచి సేకరించిన మట్టిని ఢిల్లీలోని అమత్వాటిక స్మతి వనంకు విజయవాడ కు బయలుదేరుతారని తెలిపారు. అనంతరం మాజీ సైనికుడు కె. వి. రావు ను సన్మానించారు. ప్రభుత్వ బాలికల కళాశాల నుంచి కోటి రెడ్డి కళాశాల వరకు అమత్ కలశ యాత్ర ర్యాలీ విద్యార్థులు, యువత జాతీయ జెండాలు పట్టుకుని నినాదాలు చేస్తూ నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం , స్టెప్ మేనేజర్ సుబ్బరాయుడు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీస్ షకీలా, స్వచ్చంద సంస్ధల ప్రతినిధులు, బి వి యస్ అశోక్, సుబ్బారావు, మాలకొండయ్య , యన్. యస్. యస్. వాలంటీర్స్ ఎం. అశోక్, షేక్. అయిషా,పి.చరణ్, షేక్. సోహెబ్, ఎస్.సల్మాన్, బి.లక్ష్మీకాంత్, 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు.