Sep 30,2023 00:30

ఐఈఈఈ టెక్నికల్‌ విద్యార్థులకు ఎంతో ఉపయోగం

ఐఈఈఈ టెక్నికల్‌ విద్యార్థులకు ఎంతో ఉపయోగం
- డాక్టర్‌
జయప్రకాశన్‌
ప్రజాశక్తి -రేణిగుంట: ఐఈఈఈ టెక్నికల్‌ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగప డుతుందని హైదరాబాద్‌ ఐఈఈఈ ట్రెజరర్‌ డాక్టరు జయ ప్రకాశన్‌ తెలిపారు. రేణిగుంట మండలంలోని కరకంబాడి రోడ్‌ లో వున్న శ్రీరామ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ లో ఈ నెల 27వ తేదీన ఐఈఈఈ డబ్ల్యూఐఈ అఫినిటీ గ్రూప్‌ ఐఈఈఈ సెన్సార్స్‌ కౌన్సిల్‌ చాప్టర్‌ ను శ్రీరామ ఇంజనీరింగ్‌ కళాశాల యాజమాన్యం ఘనంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైద్రాబాద్‌ సెక్షన్‌ ఐఈఈఈ ట్రెసరర్‌ డా.వి. జయప్రకాసన్‌ మాట్లాడుతూ ఐఈఈఈ టెక్నికల్‌ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. శాస్త్ర సాంకేతిక విషయాలు అందులో ఉంటాయన్నారు. ఇలాంటి సంస్థలతో భాగస్వామ్యం చేసుకొని శ్రీరామ్‌ యాజమాన్యం విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డా.కె.జయచంద్ర మాటా ్లడుతూ సెన్సార్స్‌ అనే విషయం మీద విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ సెక్షన్‌ ని తమ కాలేజ్‌ లో ప్రారంభిసు ్తన్నామన్నారు. దీనికి అనుమతి ఇచ్చిన కళాశాల యాజమాన్యం కి కతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్‌ మన్నెం రామిరెడ్డి,డైరెక్టర్స్‌ మన్నెం రామసుబ్బారెడ్డి, మన్నెం అర విందుకుమార్‌ రెడ్డి, ఐఈఈఈ స్టూడెంట్‌ బ్రాంచ్‌ కౌన్సిలర్‌ డా.ఏ.ముని శంకర్‌, ఫ్యాకల్టీ అడ్వైసర్‌ డా.బి.లలిత, యస్‌ చక్రి శ్రీధర్‌ విద్యార్థులు పాల్గొన్నారు.